105 : 1
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَـٰبِ ٱلْفِيلِ
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
105 : 2
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍ
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?[1]
105 : 3
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
105 : 4
تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;[1]
105 : 5
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍۭ
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.