113 : 1
قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
113 : 2
مِن شَرِّ مَا خَلَقَ
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]
113 : 3
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]
113 : 4
وَمِن شَرِّ ٱلنَّفَّـٰثَـٰتِ فِى ٱلْعُقَدِ
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;[1]
113 : 5
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]